ఘనంగా జనార్దన స్వామి రథోత్సవం

ABN , First Publish Date - 2022-03-18T05:59:10+05:30 IST

స్థానిక అగ్రహారంలోని జనార్ధనస్వామి, రంగనాయక స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం ముగిసిన నేపథ్యంలో గురువారం రథోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా జనార్దన స్వామి రథోత్సవం
రథోత్సవంలో భక్తజనం

ఏలూరు కార్పొరేషన్‌, మార్చి 17 : స్థానిక అగ్రహారంలోని జనార్ధనస్వామి, రంగనాయక స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవం ముగిసిన నేపథ్యంలో గురువారం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. వీధివీధినా భక్తులు స్వామి, అమ్మవార్లకు హారతులు ఇచ్చారు. ఆలయ అర్చకులు పవనకుమారాచార్యులు, యాజ్ఞిక బృందం భక్తులతో పూజలు చేయించారు. ఈవో కూచిపూడి శ్రీనివాస్‌, సిబ్బంది భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు. జనార్ధన స్వామి ఆలయం నుంచి మెయిన్‌బజారు మీదుగా తిరిగి ఆలయం వరకు రథోత్సవం కొనసాగింది.Read more