రమణక్కపేట పంచాయతీ స్థలం ఆక్రమణ

ABN , First Publish Date - 2022-11-24T00:35:41+05:30 IST

రమణక్కపేట గ్రామ పంచాయతీ స్థలాన్ని స్థానిక అధికార పార్టీ నాయకుడు ఆక్రమించుకున్నాడు.

రమణక్కపేట పంచాయతీ స్థలం ఆక్రమణ
గ్రామ సచివాలయం చుట్టూ ప్రహరీ నిర్మాణం

ముసునూరు, నవంబరు 23 : రమణక్కపేట గ్రామ పంచాయతీ స్థలాన్ని స్థానిక అధికార పార్టీ నాయకుడు ఆక్రమించుకున్నాడు. పాత పంచాయతీ కార్యాలయం ఎదు రుగా ఉన్న మూడు సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకుని ఆ స్థలంలో దుకాణాలు కట్టేందుకు పునాదులు వేశాడు. దీని పై స్థానికులు మండల, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా రు. అప్పటి సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఆక్రమణ స్థలా న్ని పరిశీలించారు. స్థలానికి సంబంధించిన రికార్డులను తీసుకురావాలని ఆక్రమణదారుడికి సూచించి నిర్మాణం నిలిపి వేయాలని ఆదేశాలు జారీచేశారు. స్థలానికి సంబం ధించిన రికార్డులను ఆక్రమణదారుడు అధికారులకు అంద జేయకపోవడంతో నిర్మాణం నిలిపివేశారు. అయితే ఇటీవల పాత పంచాయతీ భవనాన్ని తొలగించి గ్రామ సచివాల యం నిర్మించారు. సచివాలయ భవనం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులను వారం రోజుల క్రితం కాంట్రాక్టర్‌ ప్రారంభించాడు. మూడు పక్కలా నిర్మాణం పూర్తిచేసి ఆక్రమణకు గురైన స్థలంవైపు చేయలేదు. ఎందుకు చేయ లేదని కాంట్రాక్టర్‌ను స్థానికులు ప్రశ్నించగా సర్పంచ్‌ భర్త ఆక్రమణ స్థలం వరకు ప్రహరీ నిర్మాణం చేయవద్దని చెప్పి నట్లు కాంట్రాక్టర్‌ చెప్పారన్నారు. సచివాలయంలోకి వెళ్లేం దుకు దారి కూడా సరిగా లేదని, ఆక్రమణకు గురైన మూడు సెంట్ల స్థలంలో ఉన్న నిర్మాణాన్ని తొలగించకుండా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఆక్రమ ణదారుడికి కొమ్ము కాస్తున్నారని స్థాని కులు ఆరోపిస్తు న్నారు. ఆక్రమ నిర్మాణం తొలగించి పంచాయతీ స్థలం ఉన్నంత వరకు ప్రహరీ నిర్మాణం చేసేలా చర్యలు తీసుకో వాలని పలువురు కోరుతున్నారు.

ఆక్రమణ తొలగింపునకు చర్యలు

రమణక్కపేట సచివాలయానికి సంబంధించిన స్థలంలో ఉన్న ఆక్రమణను తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. ఆక్రమణదారుడు సహకరించకపోతే చట్టపరంగా చర్యలు చేపడతాం. ఆక్రమణలు తొలగించి పంచాయతీ స్థలం ఉన్నంతవరకు ప్రహరీ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.

– సత్యనారాయణ, ఎంపీడీవో, ముసునూరు

Updated Date - 2022-11-24T00:35:43+05:30 IST