వాన కురిసే వేళలో..

ABN , First Publish Date - 2022-09-09T05:27:17+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వాన కురిసే వేళలో..
ఓ వైపు వర్షం.. మరోవైపు మంచు.. కింద పచ్చని తివాచీలా పరుచుకున్న వరి పొలాలు.. వాన కురేసే వేళలో ప్రకృతి పులకరించింది.

అల్పపీడనంతో ఎడతెరపి 

లేకుండా కుండపోతగా వర్షాలు.. 

ద్వారకా తిరుమలలో అత్యధికం 

ఏలూరు సిటీ, సెప్టెంబరు 8 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎడతెరపి లేకుండా కురిశాయి. ఏలూరు నగరం తోపాటు కైకలూరు, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, టి.నరసాపురం, కొయ్యలగూడెం, పోలవ రం, గణపవరం, ఉంగుటూరు, పెదపాడు, చింతలపూడి, లింగపాలెం మండలాల్లోను జోరుగా వర్షాలు కురిసాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. జన జీవనం స్థంభించింది. అధ్వాన్నంగా మారిన డ్రైనేజీ ల నీరు రహదారులపైకి వచ్చి చేరింది. దీంతో ఆయా ప్రాంతాలు దుర్ఘందంగా తయారయ్యాయి. ఈదురు గాలులు బలంగా వీయటం వల్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గడచిన 24 గంటల్లో జిల్లాలోని ద్వారకా తిరుమల మండలంలో అత్యధికంగా 88.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జోరు వానలతో సార్వా సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో లక్షా 27 వేల హెక్టార్లలో వివిధ పంటల సాగు జరు గుతోంది. ప్రస్తుత వర్షాలు వరి సాగుకు అనుకూలి స్తుందని చెబుతున్నారు. ఈదురుగాలులకు కారణంగా పలు చోట్ల ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశా లు ఉన్నాయని చెబుతున్నారు. అరటి, కూరగాయల  తోటలకు ఈదురుగాలులు వల్ల ఇబ్బంది ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం స్థంభించింది. ఉదయం నుంచి మఽధ్యాహ్నం వరకు, రాత్రి కూడా పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా కరుస్తున్న వర్షాల వల్ల రహదారు లపైన ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ఇబ్బందు లు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

వర్షపాతం 34.6 మిల్లీమీటర్లు

అల్పపీడన ధ్రోణి కారణంగా గడ చిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా ద్వారకా తిరుమల మండలంలో 88.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 34.6 మిల్లీమీటర్లు నమోదైంది. చాట్రాయి 85.4, వేలేరుపాడు 81.2, లింగపాలెం 75.4, పెదవేగి 69.2, నూజివీడు 48.2, జీలుగుమిల్లి 45.8, ముసునూరు 43.2, కామవరపుకోట 40.2, జంగారెడ్డిగూడెం 38.4, భీమడోలు 37.4, పోలవరం 31.8, టి.నరసాపురం 30.8, చింతలపూడి 29.2, కొయ్యలగూడెం 27.6, కుక్కునూరు 24.8, ఆగిరిపల్లి 24, దెందులూరు 23.2, బుట్టాయిగూడెం 21.2, ఉంగుటూరు 17.4, కలిదిండి 15.4, నిడమర్రు 12.4, ఏలూరు 11.4, గణపవరం 10.8, పెదపాడు 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో 10 మిల్లీమీటర్లు కన్నా తక్కువ నమోదైంది.




Updated Date - 2022-09-09T05:27:17+05:30 IST