రైల్వే గేట్లు తాత్కాలికంగా మూసివేత

ABN , First Publish Date - 2022-04-24T05:58:09+05:30 IST

రైల్వే గేట్లు తాత్కాలికంగా మూసివేత

రైల్వే గేట్లు తాత్కాలికంగా మూసివేత

తణుకు, ఏప్రిల్‌ 23: రైల్వే క్రాసింగ్‌ పనుల వల్ల తాత్కా లికంగా రైల్వేగేట్లు మూసివేస్తున్నామని రైల్వే ప్రాజెక్టు మేనేజర్‌ వి.వెంకటరామిరెడ్డి తెలిపారు. రేలంగి– గుమ్మంపాడు రైల్వేలెవెల్‌ క్రాసింగ్‌ వద్ద ఆదివారం మధ్యా హ్నం 2గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2గంటల వరకు, అత్తిలి–గవరపాలెం క్రాసింగ్‌ గేట్‌ వద్ద ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమ వారం మధ్యాహ్నం 4గంటల వరకు, మంచిలి క్రాసింగ్‌ వద్ద సోమవారం మధ్యాహ్నం 2 నుంచి మంగళవారం మధ్యాహ్నం 4గం టల వరకు గేట్లు మూసి ఉంచుతామని పేర్కొన్నారు.

Read more