పౌల్ర్టీ.. భగభగ

ABN , First Publish Date - 2022-05-24T06:05:18+05:30 IST

రోహిణీ కార్తె రాక ముందే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో జనంతోపాటు పశుపక్ష్యాదులు విలవిల్లాడుతున్నారు. కొద్ది రోజులుగా భానుడు భగభగ మండుతుండడంతో

పౌల్ర్టీ.. భగభగ
దేవినేనివారిగూడె ంలో షెడ్లపైన కొబ్బరి ఆకులు, చుట్టూ గోనె సంచుల ఏర్పాటు చేసిన యజమానులు కోళ్ళపై నీటిని పిచికారీ చేస్తున్న సిబ్బంది

వేలాది కోళ్లు మృత్యువాత

భానుడి ప్రతాపానికి రోడ్డెక్కని జనం.. 

జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు 

మరో నాలుగు రోజులు ఉక్కపోత


ద్వారకా తిరుమల/ఏలూరు రూరల్‌, మే 23 : రోహిణీ కార్తె రాక ముందే ఎండలు తీవ్రరూపం దాల్చడంతో జనంతోపాటు పశుపక్ష్యాదులు విలవిల్లాడుతున్నారు. కొద్ది రోజులుగా భానుడు భగభగ మండుతుండడంతో ఉదయం 7 గంటల నుంచే బయటకు వెళ్ళడానికి భయపడే పరిస్థితి ఉంటోంది. సోమవారం జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రత 43 డిగ్రీ లు నమోదైంది. 25 నుంచి జూన్‌ 10 వరకు రోహిణీ కార్తె వస్తుంది. ఇప్పటికే పెరిగిన ఎండకు చిన్న పిల్లలు, వృద్ధు లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వడగాడ్పులు పెరగడంతో కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాను న్న వారం రోజులు ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నా రు. ఓ వైపు ఎండల తీవ్రత పెరుగుతుంటే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థి తుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటికి రావాలని చెబుతు న్నారు. భానుడు నిప్పులు చెరుగుతుండడంతో ఉక్కబోతతో కోళ్లు మృత్యువాత పడుతూ పౌలీ్ట్ర యజమానులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. గోపాలపురం నియోజ కవర్గంలో దాదాపు 95కి పైబడి కోళ్ల పరిశ్రమలున్నాయి. మంచి లాభాలు తెచ్చిపెట్టే పౌలీ్ట్ర పరిశ్రమ వేసవిలో రైతులను ముప్పు తిప్పలు పెడుతోంది. భానుడి భగభగలే ఇందుకు కారణం. ఈ వేసవిలో ఓ వారం రోజులు మిన హాయిస్తే మిగిలిన అన్ని రోజులూ ఎండ ఉగ్రరూపం దాల్చడంతో పౌలీ్ట్ర యజమానులకు కష్టాలెక్కువయ్యాయి. ఎండ వేడిమి నుంచి కోళ్లకు రక్షణ కల్పించేందుకు రాత్రిం బవళ్లు శ్రమిస్తున్నారు. కోళ్లకు ఎండ తగలకుండా కొన్ని ప్రాంతాల్లో షెడ్లకు పైన కొబ్బరి ఆకులు ఏర్పాటు చేసి, స్పింక్లర్లను అమర్చారు. ఇవి నిరంతరం ఆకులను తడప డం వల్ల షెడ్లు చల్లబడుతున్నాయి. అలాగే కోళ్లపై తరచూ నీటిని పిచికారి చేస్తున్నారు. అదేవిధంగా షెడ్ల లోపల ఫ్యాన్‌లను ఏర్పాటు చేశారు ఇలా చేయడం వల్ల 75 శాతం మేర కోళ్లను రక్షించుకోగలు గుతున్నామని రైతులు చెబుతున్నారు. 


ఎండలు తగ్గకుంటే కష్టమే

ఎండలు తగ్గకుంటే పౌలీ్ట్ర నిర్వహణ మున్ముందు కష్టమ ని చెబుతున్నారు. దేవినేనివారిగూడెం, రాళ్లకుంట, రామన్న గూడెం, మలసానివారికుంట, కొమ్మర, నారాయణపురం తదితరగ్రామాల్లో కోళ్ల ఫారాలున్నాయి. కోళ్ల సంరక్షణకు పెట్టుబడులు పెరుగుతున్నాయని, ఇది తమకు భారంగా మారిందంటున్నారు. రోజుకు 30 నుంచి 50 వరకు కోళ్ళు మృత్యువాత పడుతున్నాయని చెబుతున్నారు.


నష్టాలు భరించలేక లీజుకు ఇచ్చా

–  త్యాగభీమేశ్వరరావు, ఫారం యజమాని

పదేళ్లుగా కోళ్ల ఫారం నిర్వహించా. ఎండ, ఉక్కపోత కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నిత్యం కోళ్లు మృత్యువాత పడుతుండటంతో నష్టాలు చవిచూశాను. బర్డ్‌ఫ్లూ వంటి వ్యాధులు సైతం తమను కుంగతీసి సుమారు కోటి రూపాయల మేర నష్టమొచ్చింది దీంతో కొవ్వలికి చెందిన రైతు గంగాధరరావుకు నా ఫారాన్ని లీజుకు ఇచ్చాను.


Updated Date - 2022-05-24T06:05:18+05:30 IST