చత్తీస్‌ఘడ్‌ పోలీసుల అదుపులో ఆదివాసీ

ABN , First Publish Date - 2022-09-09T05:14:32+05:30 IST

మండల పరిధిలోని కొత్త లంకాలపల్లి గ్రామానికి చెందిన మండివి సమయ్య (దేవయ్య)ను బుధవారం రాత్రి 2 గంటల సమయంలో చత్తీస్‌ఘడ్‌ పోలీసులు అతనింటికి వచ్చి అదుపులోకి తీసుకున్నారు.

చత్తీస్‌ఘడ్‌ పోలీసుల అదుపులో ఆదివాసీ

కుక్కునూరు, సెప్టెంబరు 9: మండల పరిధిలోని కొత్త లంకాలపల్లి గ్రామానికి చెందిన మండివి సమయ్య (దేవయ్య)ను బుధవారం రాత్రి 2 గంటల సమయంలో చత్తీస్‌ఘడ్‌ పోలీసులు అతనింటికి వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సమ్మయ్య భార్య భద్రమ్మ గురువారం విలేకర్లకు తెలిపింది. ఇది ఇలా ఉండగా సమ్మయ్య 15 ఏళ్ల క్రితమే చత్తీస్‌ఘడ్‌ ప్రాంతం నుంచి కొత్తలంకాలపల్లి గ్రామానికి వలస వచ్చాడు. అయితే అప్పటికే అతనిపై చత్తీస్‌ఘడ్‌లో కేసులున్నాయి. ఇటీవల ఆ కేసులకు సంబంధించి కోర్టుకు హాజరు కాకపోవడంతో అక్కడి పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తొంది. స్థానిక పోలీసులకు కూడా ఈ విషయంపై చత్తీస్‌ఘడ్‌ పోలీసులు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.


Read more