Polavaram Tdp Leaders: ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి

ABN , First Publish Date - 2022-08-26T00:14:24+05:30 IST

కుప్పం లో వైసీపీ (Ycp) దౌర్జన్యాన్ని ఖండిస్తూ బుట్టాయగూడెం మండలం రామారావుపేట సెంటర్‌‌లో పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా...

Polavaram Tdp Leaders: ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): కుప్పం (Kuppam)లో వైసీపీ (Ycp) దౌర్జన్యాన్ని ఖండిస్తూ బుట్టాయగూడెం మండలం రామారావుపేట సెంటర్‌‌లో పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఈ కార్యక్రమంలో బుట్టాయగూడెం మండలం పార్టీ అధ్యక్షుడు మొగపర్తి సోంబాబు, రాష్ట్ర ST సెల్ సెక్రటరీ సున్నం నాగేశ్వరావు, గద్దె అబ్బులు, ఉపసర్పంచ్ కుందుల శ్రీను, రాష్ట్ర SC సెల్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మనెల్లి బాలు, గణపవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు చిలకముడి సుధాకర్, బొబ్బర ఎలీషా, ముళ్ళపూడి హర్ష, పూసులూరి రవిచందు, రవ్వ బసవరాజు, పూసులూరి శ్రీను, పసుమర్తి బిమేశ్వరరావు, పఠాన్ రసూల్ ఖాన్, తుర్రం శ్రీను, తుంపాటి సుబ్బారావు, కుంజా గాంగులు, తుంపాటి దుర్గరావు, కైకల సూరిబాబు, తెల్లం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు


ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ TDP జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తుంటే అడ్డంకులు కల్పించి చివరకు అన్న క్యాంటీన్‌ను అడ్డుకుంటున్న వైనాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విధ్వంసకర తీరుతో రాక్షస పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ప్రతిపక్ష నేతల పర్యటలను సైతం శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కేంద్రం గమనించి చర్యలు చేపట్టాలన్నారు. గవర్నర్ తన విచక్షణ అధికారంతో ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేలా సిఫార్సు చేయాలని పేర్కొన్నారు. 


‘‘పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను అడ్డుకోవడం దారుణం. గత టీడీపీ ప్రభుత్వంలో 200 చోట్ల అన్న క్యాంటీన్లు ప్రభుత్వం నిర్వహించగా, నేటి ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. తెలుగుదేశం పార్టీ సొంతంగా 16 చోట్ల అన్న క్యాంటీన్‌లను నడుపుతూ ఆయా ప్రాంతాల్లో పేదలకు పట్టెడు అన్నం పెడుతుంది.’’ అని టీడీపీ నేతలు, కార్యకర్తలు తెలిపారు. 


Updated Date - 2022-08-26T00:14:24+05:30 IST