వరద బాధితులకు అండగా కొయ్యలగూడెం టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2022-07-25T03:33:02+05:30 IST

వరద బాధితులకు అండగా కొయ్యలగూడెం టీడీపీ నేతలు

వరద బాధితులకు అండగా కొయ్యలగూడెం టీడీపీ నేతలు

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): గోదావరి (godavari) వరదలతో నిరాశ్రయులైన వేలేరుపాడు మండలం కటుకూరు పంచాయతీ బోల్లపల్లి గ్రామస్తులకు కొయ్యలగూడెం మండల టీడీపీ (Tdp) ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఏలూరు (Eluru) పార్లమెంట్ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు (Ganni veeranjaneyulu), పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు చేతుల మీదుగా వారికి పంపిణీ చేశారు. 


ఈ సందర్భంగా వరద బాధితులు మాట్లాడుతూ జోరువానలో సహాయక చర్యల్లో పాల్గొని బాధల్లో ఉన్న తమకు అండగా నిలబడిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 


ఈ కార్యక్రమంలో వేలేరుపాడు మండల పార్టీ అధ్యక్షులు అమరవరపు అశోక్,  కొయ్యలగూడెం మండల పార్టీ అధ్యక్షులు వాడపల్లి నాగార్జున, మండల ప్రధాన కార్యదర్శి కర్రి రాంబాబు, తెలుగుమహిళా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగిరెడ్ల మేఘలాదేవి, ఎర్రంపేట  గ్రామ పార్టీ అధ్యక్షులు కొండ్రేడ్డి పూర్ణ, చెరుకూరి గోపాలరావు, మార్నీ శ్రీనివాసరావు, గెడా గరటయ్య, దిప్పకాయలపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు షేక్ సిద్దు,  వాడపల్లి రాధాక్రిష్ణ, మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆకుల అరుణ, పెండ్యాల రమాదేవి, కాకి లక్ష్మి , సర్పంచ్ చాపల ఏసురత్నం, మంగపతి దేవిపేట గ్రామ పార్టీ అధ్యక్షులు, గన్నమని రత్నాజీ, మద్దుకూరి కృష్ణ, తంకట రాకేష్ చందన్ గార్లు తదితరులు పాల్గొన్నారు.


Read more