-
-
Home » Andhra Pradesh » West Godavari » Polavaram TDP Badude Badudu Boragam Srinivasulu vsp-MRGS-AndhraPradesh
-
Boragam Srinivasulu: చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి
ABN , First Publish Date - 2022-09-06T01:53:57+05:30 IST
పోలవరం నియోజకవర్గం జిలిగుమిల్లి మండలం కామయ్యపాలెంలో తెలుగుదేశం పార్టీ (TDP) నేతలు ‘బాదుడే బాదుడు’ ..

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): పోలవరం (Polavaram) నియోజకవర్గం జిలిగుమిల్లి మండలం కామయ్యపాలెంలో తెలుగుదేశం పార్టీ (TDP) నేతలు ‘బాదుడే బాదుడు’ (Badude Badudu) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులుతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు సుంకవల్లి సాయికృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి వనమా వెంకటేశ్వరరావు, మాజీ వైస్ ఎంపీపీ గూడపాటి అరుణ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు శిమకుర్తి శ్రీను, ఎంపీటీసీ నాలి శ్రీను, విరంకి ప్రసాద్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు తోట బాలు, ఎన్నంశెట్టి వెంకటేశ్వరరావు, కనకం జేయమ్మ, సిరిబత్తుల వెంకట రామారావు, బండారి సత్యనారాయణ, వులవల బాబీ, వంగూరి ఉదయ్ మణికంఠ, గుండె చిన్నోడు, సత్తినపల్లి సత్యం, గుర్రం దుర్గారావు, బొడపటి లక్ష్మినారాయణ, పెరుబోయిన కిషోర్, పేరుబోయిన నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ నిరంకుశ వైఖరి, కక్షపూరిత పాలనను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరలు, కరెంట్, ఆర్టీసీ చార్జీల పెరుగుదలపై ఇంటింటికీ వెళ్లి వివరించారు.
ఈ సందర్భంగా బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu)మాట్లాడుతూ మద్యపాన నిషేధం హామీని సీఎం జగన్ (Cm Jagan) తుంగలోకి తొక్కారన్నారు. రాష్ట్రంలో పిచ్చి మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం పోలవరం, ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అప్పులు తప్ప అభివృద్ధి లేదని.. ఇంత చెత్తపాలన ఎప్పుడూ చూడలేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని బొరగం శ్రీనివాసులు తెలిపారు.
