-
-
Home » Andhra Pradesh » West Godavari » permission in single window manner-NGTS-AndhraPradesh
-
సింగిల్ విండో విధానంలో అనుమతులు
ABN , First Publish Date - 2022-09-17T07:27:02+05:30 IST
యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఏలూరు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు పి.ఏసుదాసు అన్నారు.

జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఏసుదాసు
నూజివీడు, సెప్టెంబరు 16: యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఏలూరు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు పి.ఏసుదాసు అన్నారు. నూజివీడు ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా పరిశ్రమలశాఖ నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే యువతకు రాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 35 శాతం వరకు రాయితీలి స్తోందన్నారు. జనరల్ కేటగిరిలోని పట్టణ ప్రాంతాల్లో యువతకు 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం సబ్సిడీ, ప్రత్యేక కేటగిరిలో వున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పట్టణ ప్రాంతాల్లో 25, గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం రాయితీలు ఇవ్వడం జరుగుతుందని, మిగిలిన మొత్తంలో ఐదు నుంచి పది శాతం లబ్ధిదా రులు భరిస్తే మిగతాది బ్యాంకర్ల నుంచి రుణంగా అందించటం జరుగుతుం దన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 70 రకాల పరిశ్రమలను గుర్తించామ ని, వాటికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టుతో పరిశ్రమల కేంద్రంలో సంప్రదిం చవచ్చన్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ జోనల్ మేనేజరు కృష్ణప్రసాద్, లీడ్ బ్యాంక్ డిస్ర్టిక్ మేనేజరు వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ బ్రాంచ్ మేనేజరు శ్రీధర్, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మధురవాణి, ఎంపీడీవో జి.రాణి తదితరులు పాల్గొన్నారు.