హమ్మయ్య..!

ABN , First Publish Date - 2022-06-07T06:58:10+05:30 IST

వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. సోమవారం ఉదయం నుంచి తొలకరి జల్లులు చాలా ప్రాంతాల్లో కురిశాయి.

హమ్మయ్య..!
చాట్రాయిలో వర్షం

చల్లబడిన వాతావరణం ..ఎండ నుంచి ఉపశమనం

 జిల్లాలో తొలకరి జల్లులు..సార్వాకు రైతులు సన్నద్ధం

ఏలూరు సిటీ, మే 6: వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది.  సోమవారం ఉదయం నుంచి తొలకరి జల్లులు చాలా ప్రాంతాల్లో కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈదురుగాలులు  వీచాయి. చల్లని వాతావరణంతో జనం వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. ఏలూరు నగరంతో పాటు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, నూజి వీడు, కైకలూరు తదితర ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు కనిపించినా వాతావరణం మాత్రం ఒక్క సారిగా చల్లబడింది. నిన్న మొన్నటి వరకు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా రోహిణీ కార్తె ముగుస్తున్న సమయంలో  చల్లని వాతా వరణం ప్రజలను ఆహ్లాదపరిచింది. గణపవరం ప్రాంతంలో ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురియడంతో రహదారులు చిత్తడి చిత్తడిగా మారాయి. ఏలూరు నగరంతో పాటు జిల్లాలోని ఏజెన్సీ ప్రాం తంలో కూడా చిరుజల్లులు కురిశాయి. తొలకరి జల్లులతో జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో  రైతులు సార్వా సాగుకు సన్నద్ధం అవుతున్నారు.  వర్షాలు జోరుగా కురిస్తే సాగు సజావుగా సాగుతుందని చెబుతున్నారు.  


Updated Date - 2022-06-07T06:58:10+05:30 IST