విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

ABN , First Publish Date - 2022-03-23T05:43:54+05:30 IST

ప్రైవేటు స్కూల్‌ కరస్పాండెంట్‌ను అరెస్టు చేయా లని, పెనుమంట్ర ఎంఈవోను సస్పెండ్‌ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
ఎంఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు

ప్రైవేట్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ను అరెస్టు చేయాలని నిరసన'


పెనుమంట్ర, మార్చి 22 : ప్రైవేటు స్కూల్‌ కరస్పాండెంట్‌ను అరెస్టు చేయా లని, పెనుమంట్ర ఎంఈవోను సస్పెండ్‌ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. పొలమూరులోని ప్రైవేట్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ శ్రీనివాస రావు విద్యార్థులతో చేయకూడని పనులు చేయించుకుంటున్నాడని ఆరోపిస్తూ సోమవారం తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.అయితే ఈ సంఘటనలో కర స్పాండెంట్‌ శ్రీనివాసరావుకు ఎంఈవో సహకరిస్తున్నాడని మంగళవారం ఎం ఈవో కార్యాలయం వద్ద తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. తప్పుచేసినట్టు కరస్పాండెంట్‌ ఒప్పుకున్నప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయడంలో విద్యాశాఖాధికారులు అలసత్వం వహించారని ఆరోపించారు. పరారీలో ఉన్న కరస్పాండెంట్‌ను అరెస్టు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.ఈ సంఘటనపై సమా చారం అందడంతో డీఈవో రేణుక భీమవరం డీవైఈవోను విచారణాధికారిగా నియమించారు. ఆయన న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా స్కూల్‌ బాధ్యతలను మంగళవారం  ప్రిన్సిపాల్‌కు అప్పగించారు.ఆమె కూడా పాఠశాలకు రాకపోవడంతో విద్యాశాఖాధికారులు పాఠశాలను నిర్వహించారని సమాచారం. కరస్పాండెంట్‌పై విద్యార్థి తల్లి మర్రివాడ శ్యామల ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ రమేష్‌ కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు.

Read more