ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను నియమించాలి

ABN , First Publish Date - 2022-11-28T23:35:33+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ పోస్టు ఖాళీగా ఉండడంతో గర్భిణులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకునే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే నిమ్మల రా మానాయుడు అన్నారు.

ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను నియమించాలి
పేషెంట్‌ బంధువులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

పాలకొల్లు అర్బన్‌, నవంబరు 28 : ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ పోస్టు ఖాళీగా ఉండడంతో గర్భిణులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకునే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే నిమ్మల రా మానాయుడు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఎమ్మెల్యే నిమ్మల సందర్శించారు. ఆసుపత్రిలో ప్రసవాలకు, ఆపరేషన్లకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. సుమారు 6, 7 నియోజక వర్గాల ప్రజలకు ఈ ఆసుపత్రి అందుబాటులో ఉందన్నారు. ఇటీవల ఒక దివ్యాంగురాలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకునేందుకు వస్తే గైనకాలజిస్టు లేకపోవడంతో పట్టణం లోని ప్రెవేటు డాక్టర్‌ను రిక్వెస్ట్‌ చేసి తీసుకువచ్చి ఆపరేషన్‌ చేయించామని రామానాయుడు తెలిపారు. గైనకాలజిస్టు పోస్టును భర్తీ చేయాలని ప్రభుత్వా నికి, సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే నిమ్మల విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-11-28T23:35:35+05:30 IST