ఊపందుకున్న ధాన్యం ఎగుమతులు

ABN , First Publish Date - 2022-12-12T00:26:26+05:30 IST

మండలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం ఎగుమతులు ఊపందుకున్నాయి.

ఊపందుకున్న ధాన్యం ఎగుమతులు
పోలవరంలో ధాన్యం లోడ్‌ చేస్తున్న దృశ్యం

చాట్రాయి, డిసెంబరు 11: మండలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం ఎగుమతులు ఊపందుకున్నాయి. ‘కాటావేశారు.. ఎగుమతి మరిచారు’ శీర్షికన ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి 12 లారీలను వివిధ గ్రామాలకు పంపటంతో ధాన్యం ఎగుమతులు చురుగ్గా సాగుతున్నాయి. లారీలు అందుబాటులో లేకపోవటంతో కేంద్రాల్లో కాటాలు వేసిన ధాన్యం నిల్వలు పేరుకుపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఇంకా ఎక్కువ లారీలు పంపమని కోరామని వీలైనంత త్వరగా ధాన్యం నిల్వలన్నీ ఎగుమతి చేయటానికి చర్యలు చేపట్టినట్లు ఏవో చెప్పారు.

Updated Date - 2022-12-12T00:26:26+05:30 IST

Read more