ఈ పంటయినా దక్కేనా!

ABN , First Publish Date - 2022-02-19T05:51:11+05:30 IST

అన్నదాత మళ్లీ భయపడుతున్నాడు గత సార్వాలో ప్రకృతి విలయం కారణంగా నష్టాలను మూటగట్టుకున్నారు.

ఈ పంటయినా దక్కేనా!
పంటకు మందు కొడుతున్న రైతు

దాళ్వాకు కలిసిరాని వాతావరణం


భీమవరం రూరల్‌, ఫిబ్రవరి 18 : అన్నదాత మళ్లీ భయపడుతున్నాడు..గత సార్వాలో ప్రకృతి విలయం కారణంగా నష్టాలను మూటగట్టుకున్నాడు. ఎకరానికి 50 బస్తాలు పండే భూమి నుంచి 20 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది.. అయినా అన్నదాత వెనకడుగు వేయలేదు.. దాళ్వాసాగుకు దిగాడు. అయితే ప్రస్తుతం మారుతున్న వాతావరణంతో ఈ సారి దిగుబడి ఎలా ఉంటుందోనని ఆం దోళన చెందుతున్నాడు.ఎందుకంటే ప్రస్తుత వాతావరణం తెగుళ్ళు వచ్చేలా ఉండడంపై రైతులు కంగారు పడుతున్నారు. చలి, మంచు ఎక్కువ ఉండడంతో పాటు మేఘాలు పట్టడంతో తెగుళ్ళు వచ్చే అవకాశం ఉందని అంటున్నాడు. వాతావరణం ఇలాగే ఉంటే నాట్లు వేసిన పదిహేను రోజులైన వరి చేలకు మొవ్వు తెగులు, నెలరోజులైన చేలకు అగ్గితెగులు, ముడత వస్తాయని రైతులు చెబుతున్నారు. దీంతో కొన్ని చోట్ల రైతులు ముందస్తు పిచికారీ చేస్తున్నారు. వ్యవసాయాధికారులు స్పందించి సూచనలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Read more