ఓవరాల్‌ ఛాంపియన్‌.. పశ్చిమ గోదావరి

ABN , First Publish Date - 2022-09-27T05:38:14+05:30 IST

పెద అమిరంలోని అభ్యాస్‌ ద గ్లోబల్‌ స్కూల్లో నిర్వ హించిన మూడో రాష్ట్రస్థాయి మల్లకంబ్‌, 15వ రాష్ట్రస్థాయి రోప్‌ స్కిప్పింగ్‌ పోటీలు సోమవారంతో ముగిశాయి.

ఓవరాల్‌ ఛాంపియన్‌.. పశ్చిమ గోదావరి
గెలుపొందిన జట్టుకు ట్రోఫీ అందిస్తున్న ఎమ్మెల్యే రామరాజు

కాళ్ళ, సెప్టెంబరు 26 : పెద అమిరంలోని అభ్యాస్‌ ద గ్లోబల్‌ స్కూల్లో నిర్వ హించిన మూడో రాష్ట్రస్థాయి మల్లకంబ్‌, 15వ రాష్ట్రస్థాయి రోప్‌ స్కిప్పింగ్‌ పోటీలు సోమవారంతో ముగిశాయి. మల్లకంబ్‌ పోటీల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌గా పశ్చిమ గోదావరి జిల్లా జట్టు విజయం సాధించగా, రోప్‌ స్కిప్పింగ్‌ పోటీల్లోనూ పశ్చిమ గోదావరే ఛాంపియన్‌షిప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పి. అనిత సుహాసిని మాట్లాడుతూ దాదాపు 19 జిల్లాల నుంచి 400 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు చేతుల మీదుగా క్రీడాకారులకు ట్రోఫీలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ డొక్కు సోమేశ్వరరావు, దాట్ల సూర్యనారాయణరాజు, మల్లకంబ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి శేఖర్‌రాజు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read more