నవంబరు 12న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2022-09-10T06:29:27+05:30 IST

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కోర్టుల్లో నవంబరు 12న జాతీయ లోక్‌ అదాలత్‌లు నిర్వహి స్తున్నట్టు న్యాయసేవాధి కార సంస్థ కార్యదర్శి రాజేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు.

నవంబరు 12న జాతీయ లోక్‌ అదాలత్‌

ఏలూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 9: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కోర్టుల్లో నవంబరు 12న జాతీయ లోక్‌ అదాలత్‌లు నిర్వహి స్తున్నట్టు న్యాయసేవాధి కార సంస్థ కార్యదర్శి రాజేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకోవాలనుకునే క్రిమినల్‌ కేసులు, విచారణలో ఉన్న క్రిమినల్‌ కేసులు, లేబర్‌, మనోవర్తి, గృహహింస, చెక్‌ బౌన్స్‌ కేసులు, క్రిమినల్‌ అప్పీళ్ళు, క్రిమినల్‌ రివిజన్‌ పిటీషన్లు, అన్ని రకాల సివిల్‌, కోర్టు ముందుకు రాని బ్యాంకు రుణాలు, వాహన సంబంధ కేసులు, రెవెన్యూ, విద్యుత్‌, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. గత నెల జరిగిన అదాలత్‌లో జిల్లా వ్యాప్తంగా 5,657 కేసులు రాజీ చేశామన్నారు.

Read more