-
-
Home » Andhra Pradesh » West Godavari » no way to jagananna colony-NGTS-AndhraPradesh
-
దారేది జగనన్నా..!
ABN , First Publish Date - 2022-09-08T05:49:26+05:30 IST
పేదవాడి సొంత ఇంటి కల ఎలాఉన్నా.. ఆ ఇంటికి వెళ్లే దారి మాత్రం లేదు.

పెనుగొండ, సెప్టెంబరు 7: పేదవాడి సొంత ఇంటి కల ఎలాఉన్నా.. ఆ ఇంటికి వెళ్లే దారి మాత్రం లేదు. స్థలాలు కేటాయించాం.. ఇళ్లు కట్టుకోండి అని ఒత్తిడి చేయడం తప్ప మౌలిక సదుపా యాల కల్పన పట్టించుకున్నవారే లేరు. నీరు, కరెంట్ తర్వాత సంగతి.. కనీసం నిర్మాణం వద్దకు వెళ్లే దారే లేదని నిర్మాణ దారులు గగ్గోలు పెడుతున్నారు. పెనుగొండ మండలం రామన్నపాలెం జగననన్న కాలనీలో చాలా మంది తమ సొంత ఇంటి కల నెరవేర్చుకునే దిశగా నిర్మాణాలు ప్రారంభిం చారు. కాలనీకి వెళ్లేందుకు సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్నారు. అసలే వర్షాకాలం.. చినుకు పడితే మోకాలి లోతు బురదలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉందని లబ్ధిదా రులు వాపోతున్నారు. ఇసుక, సిమెంట్, ఐరన్, ఇటుక తరలించాలంటే అధిక కూలీ ధరలు చెల్లించాల్సిందే. అధిక ఖర్చు భరించి నా అధ్వాన దారిపై తిప్పలు తప్పడం లేద ని ఆవేదన చెందుతున్నారు. కాలనీకి రహదారిపై అధికారులు దృష్టి సారించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.