-
-
Home » Andhra Pradesh » West Godavari » neet complete-NGTS-AndhraPradesh
-
ప్రశాంతంగా ‘నీట్’
ABN , First Publish Date - 2022-07-18T06:12:33+05:30 IST
ప్రశాంతంగా ‘నీట్’

తాడేపల్లిగూడెం రూరల్/ తణుకు/భీమవరం ఎడ్యుకేషన్, జూలై 17: నీట్(యూజీ) 2022 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. తాడే పల్లిగూడెం మండలంలోని పెదతాడేపల్లిలోని భారతీయ విద్యాభవన్స్, లోట స్ పాఠశాలల్లో 374 మందికి 360 మంది, తణుకులో ముళ్లపూడి మెమోరియల్ పాల్‌టెక్నిక్ కళాశాల, ఎస్‌డీఎస్ ఐటీ కళాశాల, స్టెప్పింగ్ స్టోన్ పాఠశాల, ఎస్‌ఎఫ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో 986 మందికి 972 మంది, భీమ వరం భారతీయ విద్యాభవన్స్ స్కూల్‌లో 1,016 మందికి 963 మంది హాజ రయ్యారు. ఒక్క నిమిషం అలస్యమైనా పరీక్ష రాసేందుకు వీలు లేదని నిబంధన ఉండడంతో విద్యార్థులంతా గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరు కున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 5:30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.