పుస్తక పఠనం విజ్ఞానానికి సోపానం

ABN , First Publish Date - 2022-11-16T23:19:41+05:30 IST

పుస్తక పఠనంతో విలువలతో కూడిన విజ్ఞానం వస్తుందని శాస్త్రవేత్త డి.సుబ్బారావు అన్నారు.

పుస్తక పఠనం విజ్ఞానానికి సోపానం
ఆరవల్లి శాఖా గ్రంథాలయంలో విద్యార్థులు

నరసాపురం టౌన్‌, నవంబరు 16: పుస్తక పఠనంతో విలువలతో కూడిన విజ్ఞానం వస్తుందని శాస్త్రవేత్త డి.సుబ్బారావు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తరచు పుస్తకాలు చదవడం వల్ల తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయన్నారు. అంతకు ముందు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. లైబ్రరీ అధికారి కుమారి, చినమిల్లి శ్రీనివాస్‌, అల్లూరి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

ఆకివీడు: పుస్తక పఠనం విజ్ఞానానికి సోపానమని శాఖా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ దాసరి సత్యనారాయణ అన్నారు. శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి పార్వతి, ఉపాధ్యాయులు విక్రమ్‌, పురుషోత్తం తదితరులు ఉన్నారు.

అత్తిలి: ఆరవల్లి శాఖా గ్రంథాలయంలో అయ్యంకి వెంకట రమణయ్య, పాతూరి నాగభూషణం, ఎస్‌ఆర్‌ రంగనాథన్‌ చిత్రపటాలకు పూలమా ల వేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా హెచ్‌ఎం ఎంవీఎల్‌కె ప్రసాద్‌ పాల్గొన్నారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ నాగ శ్రీనివాస్‌, గ్రంథాలయాధికారి ఎస్‌.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-16T23:19:43+05:30 IST