-
-
Home » Andhra Pradesh » West Godavari » national karate sports-NGTS-AndhraPradesh
-
జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-09-11T05:45:34+05:30 IST
క్రీడలు లక్ష్య సాధనతో పాటు ఆత్మస్థైర్యం నింపుతాయని తపన ఫౌండేషన్ వ్యవస్థాపకు డు గారపాటి చౌదరి అన్నారు.

పెదపాడు, సెప్టెంబరు 10: క్రీడలు లక్ష్య సాధనతో పాటు ఆత్మస్థైర్యం నింపుతాయని తపన ఫౌండేషన్ వ్యవస్థాపకు డు గారపాటి చౌదరి అన్నారు. రెండు రోజులు జరిగే నేషనల్ కరాటే ఓవరాల్ ఛాంపియన్‌షిప్ తపన ఫౌండేషన్ కప్ పోటీలను వట్లూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పలు రాష్ట్రాల నుంచి 46 టీంలు, 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు కె.వెంకటేశ్వరరావు, ట్రెడిషనల్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డీఎల్ నారాయణ, కార్యదర్శి నాగం శివ, కోశాధికారి ఇబ్రహీం బేగ్ తదితరులు పాల్గొన్నారు.