అప్పు తీర్చలేకే హత్య..

ABN , First Publish Date - 2022-09-28T05:51:01+05:30 IST

కరుగోరుమిల్లి శివారు ముత్యాలవారిపాలెంకు చెందిన లూటికుర్తి మార్తమ్మను (50) గుర్తు తెలియని వ్యక్తులు రాడ్‌తో హత్య చేసిన ఘటనలో నిందితులను మంగళవారం అరెస్టు చేసి చేశారు.

అప్పు తీర్చలేకే హత్య..

మహిళా హత్య కేసులో నిందితులు అరెస్టు

డీఎస్పీ రామాంజనేయరెడ్డి

ఆచంట, సెప్టెంబరు 27 : కరుగోరుమిల్లి శివారు ముత్యాలవారిపాలెంకు చెందిన లూటికుర్తి మార్తమ్మను (50)  గుర్తు తెలియని వ్యక్తులు రాడ్‌తో హత్య చేసిన ఘటనలో నిందితులను మంగళవారం అరెస్టు చేసి చేశారు. నరసాపురం డీఎస్పీ రామాంజనేయరెడ్డి స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేకరులకు వివరించారు. గ్రామానికి చెందిన కొండేటి నాగరాజు, గాదం రామాంజనేయులు అనే అంజి మృతురాలు వద్ద నుంచి అధిక వడ్డీకి డబ్బులు తీసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు.  వీరిద్దరు మార్తమ్మకు డబ్బులు చెల్లించని కారణంగా వారిపై ఆమె ఒత్తిడి తీసుకురావడంతో ఆ  అప్పు తీర్చలేక వారిద్దరు మార్ట్తమ్మను చంపి ఆమె వద్ద ఉన్న ప్రామిసరీ నోట్లు తీసుకోవాలని నిర్ణయించారు. వీరితో పాటు కందరవల్లికి చెందిన కొల్లి జయరాజుతో కలిసి ముగ్గురు కుట్ర పన్ని ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్లి పచ్చడి బండతో  తలపైన, నుదిటిమీద దారుణంగా కొట్టి చంపి గ్రామం విడిచి పారిపోయారు. మృతురాలి పెద్దల్లుడు సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పెనుగొండ సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర ఎస్‌ఐలు ప్రసాద్‌, రమేష్‌, సురేంద్ర కుమార్‌ మూడు టీమ్‌లుగా ఏర్పడి గాలించగా మంగళవారం అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ కేసు విచారణలో పాల్గొన్న సీఐ, ఎస్‌ఐలు, క్రైం బ్రాంచి సిబ్బంది బి.రవి, కానిస్టేబుళ్లను అభినందించి రివార్డు అందజేశారు. 

Read more