పింఛన్లు తొలగిస్తారా..?

ABN , First Publish Date - 2022-12-30T00:03:55+05:30 IST

పింఛన్లను తొలగిస్తూ ఇటీవల నోటీసులు జారీ చేయడంపై మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

పింఛన్లు తొలగిస్తారా..?
సమావేశంలో కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే ముదునూరి

మున్సిపల్‌ సమావేశంలో కౌన్సిలర్ల నిలదీత

ఆందోళన వద్దు : ఎమ్మెల్యే ముదునూరి

నరసాపురం టౌన్‌, డిసెంబరు 29: పింఛన్లను తొలగిస్తూ ఇటీవల నోటీసులు జారీ చేయడంపై మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు అభ్యంతరం తెలిపారు. గురువారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అధికార వైసీపీ, ప్రతి పక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన సభ్యులు, స్వతంత్రులు అంతా ముక్త కంఠంతో పింఛన్ల తొలగింపు నోటీసులు సరికాదన్నారు. ఏళ్ల తరబడి వృద్ధు లు, దివ్యాంగులు, వితంతువులు పింఛన్లు తీసుకుంటున్నారని, హఠాత్తుగా పింఛన్లు నిలిపివేస్తే వారి జీవనం ఎలా అని టీడీపీ సభ్యుడు పాలూరి బాబ్జి, వైసీపీ సభ్యులు వన్నెంరెడ్డి శ్రీను, కొత్తపల్లి నాని, జనసేన సభ్యులు తోట అరుణ, బొమ్మిడి సూర్యకుమారి, స్వతంత్ర సభ్యులు కోటిపల్లి సురేష్‌ ప్రశ్నించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరమణ అధ్యక్షత జరిగిన సమా వేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ పింఛన్ల తొలగింపు నోటీ సులపై లబ్ధిదారులు ఆందోళన చెందనవసరం లేదన్నారు. అర్హులందరికీ ప్రభుత్వం పింఛన్‌ అందజేస్తుందన్నారు. పట్టణంలో పలు సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. పారిశుధ్యం అధ్వానంగా మారింది, ఇంజనీరింగ్‌ విభాగంలో కాంట్రాక్టు పనులు మాత్రమే జరుగుతున్నాయని వైసీపీ సభ్యులు బొంతు రాజశేఖర్‌, వైకెఎస్‌, కేసరి గంగరాజు, సఖినేటిపల్లి సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ మణి మాట్లాడుతూ ఇది అవాస్తమని, ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతున్నామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సమావేశంలో కమిషనర్‌ శ్రీనివాసులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:03:55+05:30 IST

Read more