క్షుద్ర పూజల కలకలం !

ABN , First Publish Date - 2022-09-08T05:55:33+05:30 IST

మొగల్తూరులో క్షుద్రపూజల కలకలం రేగింది. బుధవారం వేకువజామున కొండావారిపాలెం వద్ద జాతీయ రహదారిపై గుమ్మడి కాయలు, కుండలు, ఎర్రటి అన్నం, పసుపు, కుంకుమ, ఐదు కోడి పెట్టలు పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

క్షుద్ర పూజల కలకలం !

మొగల్తూరు, సెప్టెంబరు 7 : మొగల్తూరులో క్షుద్రపూజల కలకలం రేగింది. బుధవారం వేకువజామున కొండావారిపాలెం వద్ద జాతీయ రహదారిపై గుమ్మడి కాయలు, కుండలు, ఎర్రటి అన్నం, పసుపు, కుంకుమ, ఐదు కోడి పెట్టలు పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ఎం.వీరబాబు స్థానికులను విచారించగా వేకువజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తుండగా కేకలు వేయడంతో ఆ వస్తువులను వదిలి వెళ్లిపోయారని తెలిపారు. గ్రామస్థులు వాటిని చూసేందుకు ఎగబ డ్డారు. సర్పంచ్‌ భర్త పడవల సత్యనారాయణ వాటిని సమీపంలోని కాల్వలో పడేశారు. ఎస్‌ఐ వీరాబాబు విలేకరులతో మాట్లాడుతూ గ్రామస్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని త్వరలో నిందితులను పట్టుకుంటామని, గ్రామస్థులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.  

Updated Date - 2022-09-08T05:55:33+05:30 IST