ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు అరెస్టు, విడుదల

ABN , First Publish Date - 2022-04-24T06:15:38+05:30 IST

సీపీఎస్‌ రద్దు కోరుతూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్‌ జాతాను నూజివీడు పట్టణ పోలీసులు అడ్డుకున్నారు.

ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు అరెస్టు, విడుదల

నూజివీడు టౌన్‌, ఏప్రిల్‌ 23: సీపీఎస్‌ రద్దు కోరుతూ యూటీఎఫ్‌  ఆధ్వర్యంలో చేపట్టిన బైక్‌ జాతాను నూజివీడు పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణ్‌రావు, యూటీఎఫ్‌ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎ.సుందరయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకుడు జి.వెంకటేశ్వర రావు తదిత రులను జాతాకు ముందస్తు అనుమతులు లేవంటూ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ తరలించి అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు. 


Read more