పాఠశాలలో డైనింగ్‌ హాల్‌ నిర్మిస్తా

ABN , First Publish Date - 2022-09-26T06:35:35+05:30 IST

తాను చదువుకున్న పాఠశాలలో విద్యార్థులకోసం డైనింగ్‌ హాల్‌ నిర్మించనున్నట్టు ఎమ్మెల్సీ ఎం. అరుణ్‌ కుమార్‌ తెలిపారు.

పాఠశాలలో డైనింగ్‌ హాల్‌ నిర్మిస్తా
మొగల్తూరు ఉన్నత పాఠశాలలో డైనింగ్‌ హాల్‌ నిర్మాణ అంచనాలు పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌

పూర్వ విద్యార్థి, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ 


మొగల్తూరు, సెప్టెంబరు 25: తాను చదువుకున్న పాఠశాలలో విద్యార్థులకోసం డైనింగ్‌ హాల్‌ నిర్మించనున్నట్టు ఎమ్మెల్సీ ఎం. అరుణ్‌ కుమార్‌ తెలిపారు. ఆదివారం మొగల్తూరు ఉన్నత పాఠశాల ఆవరణలో డైనింగ్‌ హాల్‌ నిర్మాణం కోసం ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను, తన అన్న కృష్ణాజిల్లా నందిగామ ఎమ్మెల్యే జగన్‌మోహనరావు, తన సోదరీ, మరో సోదరుడు మొగల్తూరులోని ఇదే పాఠశాలలో విద్యనభ్యసించామని,  తన తల్లి మరియమ్మ పేరిట తమ కుటుంబ సభ్యులు రూ. 20 లక్షలు వెచ్చించి డైనింగ్‌ హాల్‌ నిర్మించతలపెట్టామన్నారు.  ఆయన వెంట జేఈ శ్రీనివాస్‌తో పాటు  మిత్రబృందం పెంకే నర్సింహరావు, గురుజు హనుమాన్‌, కడలి బాబి తదితరులున్నారు.

Read more