MLA Rapaka సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-07-18T18:09:20+05:30 IST

రాజోలు (Rajolu) ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLA Rapaka సంచలన వ్యాఖ్యలు

రాజమండ్రి (Rajahmundry): రాజోలు (Rajolu) ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Varaprasada Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియా (Media)తో మాట్లాడుతూ రాజోలు ఏటిగట్టుకు గండి కొట్టేందుకు స్థానికులైన 15 మంది కుట్ర చేశారని, వాళ్ళంతా తనకు తెలిసిన వాళ్ళేనన్నారు. ఆ 15 మందిపై కేసులు పెడతామని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి ఇంట్లో కూర్చుని తప్పుడు వీడియోలు.. సోషల్ మీడియాలో పెట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నాడని, అటువంటి చెత్తగాళ్ళు పెట్టే వీడియోలు నమ్మవద్దన్నారు. అధికారులు, స్థానిక యువకులు కలిసి ఏటిగట్టు వద్ద ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి ప్రజలను ముంపు నుంచి రక్షించుకున్నామని చెప్పారు. మరి కొద్దిసేపట్లో వరద తగ్గుముఖం పట్టి ప్రమాదం నుంచి బయటపడతామని ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-07-18T18:09:20+05:30 IST