వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడదాం

ABN , First Publish Date - 2022-12-30T00:13:05+05:30 IST

వైసీపీ నియంతృత్వ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. ‘

వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడదాం

ఉండి ఎమ్మెల్యే రామరాజు

నాలుగో రోజు సైకిల్‌ యాత్ర

కాళ్ళ, డిసెంబరు 29 : వైసీపీ నియంతృత్వ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. ‘ఇదేం ఖర్మ’లో భాగంగా నాలుగో రోజు గురువారం కాళ్ల గ్రామం నుంచి సైకిల్‌ యాత్ర ఉత్సాహంగా సాగింది. తొలుత గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కందుకూరు నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తలకు నివాళులర్పించి యాత్ర ప్రారంభించారు. కాళ్ళ, దొడ్డనపూడి, కాళ్ళకూరు, జువ్వలపాలెం, ఏలూరుపాడు, ప్రాతాళ్ళమెరక, పల్లిపాలెం, కలవపూడి, ఎస్సీ బోస్‌ కాలనీ, మాలవానితిప్ప, ఆనందపురం, ఎల్‌ఎన్‌పురం, గ్రామాల మీదుగా సుమారు 50 కిలోమీటర్లు యాత్ర నిర్వహించారు. జువ్వలపా లెంలో టీడీపీ భారీ బెలూన్‌ను ఆయన ప్రారంభించారు. మహిళా శ్రేణులు హారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. వరి, ఆక్వా సాగు రైతులు పడుతున్న ఇబ్బందులను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజల కష్టాలు తీరతాయన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తీర్చకపోతే అమరావతి వరకు సైకిల్‌ యాత్ర చేపడతానంటూ స్పష్టం చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు జీవీ నాగేశ్వరరావు, కరిమెరిక నాగరాజు, ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు యశోద కృష్ణయ్య, తోట ఫణిబాబు, అడ్డాల శివరామరాజు, అడ్డాల గణపతిరాజు, గోకరాజు నాగరాజు, నంబూరి త్రిమూర్తులురాజు, మంతెన ఆంజనేయరాజు, కంతేటి శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:13:06+05:30 IST