రాష్ట్రంలో 8.89 లక్షల ఇళ్ల నిర్మాణాలు : మంత్రి

ABN , First Publish Date - 2022-02-19T05:53:11+05:30 IST

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతుంటే చూసి ఓర్వలేక టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు.

రాష్ట్రంలో 8.89 లక్షల ఇళ్ల నిర్మాణాలు : మంత్రి
విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి రంగనాథరాజు

ఆచంట,  ఫిబ్రవరి 18: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతుంటే చూసి ఓర్వలేక టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు. తూర్పుపాలెంలోని క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం విలేకరు లతో మాట్లాడారు.ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలి ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడడం సరైన పద్ధతికాదన్నారు. రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకున్నా మన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 8.89 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వంపై బురదజల్లడం ప్రతిపక్షపార్టీ మానుకోవాలన్నారు.

Read more