-
-
Home » Andhra Pradesh » West Godavari » Minister Ambati comments anr-MRGS-AndhraPradesh
-
Buchaiah Choudhary: నిర్వాసితుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఇదేనా?..
ABN , First Publish Date - 2022-09-19T17:01:41+05:30 IST
పోలవరం ముంపు గ్రామాల విషయంలో గ్రామాల వారీ, ఎకరాల వారీగా ఇప్పటి వరకూ నష్టపరిహరం పొందిన..

అమరావతి (Amaravathi): ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు మూడో రోజు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి (Buchaiah Choudhary) మాట్లాడుతూ పోలవరం ముంపు గ్రామాల విషయంలో గ్రామాల వారీ, ఎకరాల వారీగా ఇప్పటి వరకూ నష్టపరిహరం పొందిన రైతులు వివరాలు అడిగిందానికి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అని సమాధానం చెపుతారా అంటూ ప్రశ్నించారు. నిర్వసితుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? అన్నారు. ఢయాఫ్రంవాల్ ఎందుకు పోయింది. ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం ఎందుకు పూర్తికాలేదు అంటే చెప్పడం లేదని బుచ్చయ్య చౌదరి అన్నారు.
మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) మాట్లాడుతూ ఢయా ఫ్రంవాల్, కాఫర్ డ్యాంల గురించి చంద్రబాబు వచ్చి అడిగితే చెపుతానన్నారు. ఢయాఫ్రం వాల్ కావాలంటే ముందు కాఫర్ ఢ్యం పూర్తి చేయాలని, మధ్యలో కాఫర్ డ్యాంలు వేశారు.. వాటి గ్యాంప్ లోంచి నీరు వెళ్లి డయాఫ్రం వాల్ కొట్టికు పోయిందన్నారు. కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తిచేయకపోవడం వల్ల డయాఫ్రం వాల్ రూ. 400 కోట్లు.. దాని వెంట గుంతలు పూడ్చడానికి రూ. 2500 కోట్లు.. మొత్తంగా రూ. 3వేల కో్ట్లు అని అన్నారు. పోలవరంలో చంద్రబాబు (Chandrababu) చేసిన తప్పు తరతరాలను వెంటాడుతుందని, ఇదే పని వేరే దేశంలో చేస్తే చంద్రబాబుకు ఉరేస్తారని మంత్రి అంబటి అన్నారు.