మెరిట్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ పంపిణీ

ABN , First Publish Date - 2022-04-05T05:32:51+05:30 IST

పెదలంకలో సోమవారం ఆదివెలమ శ్రేయోభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ సంఘం వారు మెరిట్‌ విద్యార్థుల కు సోమవారం స్కాలర్‌షిప్‌ పంపిణీ చేశారు.

మెరిట్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ పంపిణీ

కలిదిండి, ఏప్రిల్‌ 4 : పెదలంకలో సోమవారం ఆదివెలమ శ్రేయోభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ సంఘం వారు మెరిట్‌ విద్యార్థుల కు సోమవారం స్కాలర్‌షిప్‌ పంపిణీ చేశారు. 45 మంది విద్యార్థులకు రూ.1,21,000 అందించారు. ఈ సంద ర్భంగా సెంట్రల్‌ సంఘం అధ్యక్షుడు పిళ్లారిశెట్టి వెంకట్‌ రమేష్‌, హరిగోపాల్‌కు కలిదిండి ఏరియా సంఘం వారు ధన్యవాదాలు తెలిపారు. మెరిట్‌ విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్‌ షిప్‌లు అందించటం అభినందనీయమన్నారు. ఆదివెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అక్కల వెంకట చలం (బోసు), దుగ్గిరాల రంగారావు, దున్న భోగేశ్వ రరావు, యిమ్మనేని శేఖర్‌, కోకా రాజు, పోకల వెంకటేశ్వరరావు, ముద్దం రంగారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Read more