అబుల్‌ కలాం ఆజాద్‌ సంస్కరణలతో విద్యా రంగం పటిష్ఠం

ABN , First Publish Date - 2022-11-11T23:33:38+05:30 IST

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ప్రథమ విద్యాశాఖామంత్రిగా చేపట్టిన సంస్కరణలతో విద్యా రంగం పటిష్టమైందని, ఈ నాటికి అమలు అవుతున్నాయని శ్రీవిజ్ఞానవేదిక కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి అన్నారు.

అబుల్‌ కలాం ఆజాద్‌ సంస్కరణలతో విద్యా రంగం పటిష్ఠం
వీరవాసరంలో నివాళులర్పిస్తున్న విద్యార్థులు

భీమవరం టౌన్‌, నవంబరు 11: మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ప్రథమ విద్యాశాఖామంత్రిగా చేపట్టిన సంస్కరణలతో విద్యా రంగం పటిష్టమైందని, ఈ నాటికి అమలు అవుతున్నాయని శ్రీవిజ్ఞానవేదిక కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి అన్నారు. అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా శ్రీవిజ్ఞాన వేదిక, ముస్లిం కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో కలాం విగ్రహం వద్ద నివాళుల ర్పించారు. ముస్లిం కమిటీ చైర్మన్‌ షేక్‌ రబ్బానీ, ఎండి ఖలీల్‌, ఎండి బాబ్జి, ఎస్‌కె అన్సారీ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, నందమూరి రాజేష్‌ పాల్గొన్నారు.

పాలకొల్లు: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ జయంతి, జాతీయ విద్యా దినోత్సవం రసూల్‌ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. అధ్యక్షుడు షేక్‌ రసూల్‌ ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. షేక్‌ చాంద్‌ బీబి, అట్టాడ సీతారాం, షేక్‌ బాబాజీ, షేక్‌ భాషా, షేక్‌సత్తార్‌, తదితరులు పాల్గొన్నారు. ఏఎస్‌ ఎన్‌ఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ వికె మల్లేశ్వరరావు అజాద్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

వీరవాసరం: రాయకుదురు జడ్పీహైస్కూల్‌లో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి హెచ్‌ఎం అంగర వేణుగోపాలకృష్ణ, ఉపాధ్యాయులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్‌వివి లక్ష్మి, బి హేమలత, బోను దుర్గాప్రసాద్‌, గజేంద్ర ఘట్కర్‌ , మద్దాల వెంకటలక్ష్మి, ఉమాదేవి, పుల్లంరాజు తదితరులు పాల్గొన్నారు.

పెంటపాడు: భారత తొలి విద్యా శాఖా మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రిన్సిపాల్‌ ఎం.శ్యాంబాబు అన్నారు. పెంటపాడు డీఆర్‌ గోయెంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆజాద్‌ జయంతి సందర్భంగా ప్రిన్సిపాల్‌ శ్యాంబాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

Updated Date - 2022-11-11T23:33:39+05:30 IST