Maganti Babu: కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడే అనుమానించా..

ABN , First Publish Date - 2022-09-29T18:11:19+05:30 IST

ఆరు నెలల క్రితం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడే అనుమానించానని మాగంటి బాబు అన్నారు.

Maganti Babu: కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడే అనుమానించా..

ఏలూరు జిల్లా (Eluru dist.): అమరావతే రాజధానిగా ఉండాలని హైకోర్టు (High Court) తీర్పు ఇచ్చినా.. ప్రభుత్వం సుప్రీం కోర్టు (Supreme Court)కు వెళ్లడం వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ (Jagan Master Plan) ఉందని టీడీపీ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు (Maganti Babu) అన్నారు. ఆరు నెలల క్రితం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ (NTR) పేరు పెట్టినప్పుడే అనుమానించానన్నారు. అందులో భాగంగానే హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలలకు సుప్రీం కోర్టుకు వెళ్లారని అన్నారు. రైతుల పాదయాత్ర (Padayatra)కు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నా మాగంటి బాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. రైతుల మహా పాదయాత్రకు విశేష స్పందన వస్తోందన్నారు. గ్రామాల ప్రజలు భారీగా తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారని అన్నారు.


రైతులు చేస్తున్నది మామూలు ఉద్యమం కాదుని, రైతులు మోసపోయిన ఉద్యమం అని మాగంటి బాబు అన్నారు. రాజధాని కోసం 30 వేల ఎకరాలు ఇచ్చి మోసపోవడం ఏపీలో తప్ప.. చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ప్రపంచంలో కూడా ఇన్ని రోజులు చేసే ఉద్యమాలు కనపించలేదన్నారు. ఇలాంటి ఉద్యమానికి అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపిచ్చారు. ఇంత ఉద్యమం జరుగుతున్నా.. సీఎం జగన్‌కు చీమ కుట్టినట్టు కూడా లేదని, దున్నపోతుమీద వర్షం కురిసినట్టే ఉందన్నారు. మూడున్నరేళ్లలో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు కుక్కల కన్నా హీనంగా ఉన్నాయన్నారు. కుక్కలకైనా విశ్వాసం ఉంటుందన్నారు. తాను ఒకప్పుడు మంత్రిగా చేశానని, తిట్టడంవల్ల పరిష్కారం అవుతుందనుకుంటే.. వైసీపీ నేతలకంటే బాగా తిట్టగలనని మాగంటి బాబు అన్నారు.

Updated Date - 2022-09-29T18:11:19+05:30 IST