హర హర..మహాదేవ !

ABN , First Publish Date - 2022-11-20T23:38:53+05:30 IST

కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. శివాలయాల్లో శివనామ స్మరణ మార్మోగింది.

హర హర..మహాదేవ !
ఏలూరు బావిశెట్టివారిపేట కాశీ విశ్వేశ్వర ఆలయంలో బిల్వార్చన

మార్మోగిన శివనామస్మరణ

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. శివాలయాల్లో శివనామ స్మరణ మార్మోగింది. ఆలయ ప్రాంగణాలు భక్తులతో కిటకిటలాడాయి.

ఏలూరుకార్పొరేషన్‌, నవంబరు 20 : కార్తీక మాసంలోని బహుళ ఏకాదశి, ఆఖరి ఆదివారం కావడంతో నగరంలోని పలు డివిజన్లలో గల శివాలయాల వద్ద భక్తులు విశేష పూజలతో శివనామస్మరణతో ఆరాధించారు. అగ్రహారంలో కాశీ అన్నపూర్ణాసమేత ప్రతాప విశ్వేశ్వరస్వామి ఆలయంలో స్వామికి అర్చక బృందం సామూహికంగా లక్ష బిల్వార్చన నిర్వహించారు. బావిశెట్టివారిపేటల కాశీ విశ్వేశ్వరాలయంలో అర్చకులు కుమారశాస్త్రి, శేషాచలం బృందం లక్ష బిల్వార్చన జరిపించారు. శివనగర్‌లో భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన, జ్యోతిర్లింగార్చన నిర్వహించారు. మినీ బైపాస్‌ రోడ్డులో భవానీ సమేత విశ్వంభరేశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించారు. ఈ మేరకు శివాలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది.

జంగారెడ్డిగూడెం :గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థా నంలో కార్తీకమాస మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం విశేష పూజలు, శ్రీసువర్చలా హనుమద్‌ కల్యానాన్ని ప్రధానా ర్చకులు వేదాంతం వెంకటాచార్యులు, వేదపండితులు ఆధ్వర్యంలో నిర్వహిం చారు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన రావి బేబి సత్యవాణి బృందం వారిచే కూచుపూడి నృత్యప్రదర్శన నిర్వహించారు.

కేరళ ఆచారాలతో పడి పూజ, భజన

ఏలూరు కార్పొరేషన్‌ : కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా ఆదివారం స్థానిక పవరుపేట తుండూరి వారి సత్రం ప్రాంగణంలో ఆదివారం రేపల్లెకు చెందిన తోట శివశంకరరావు గురుస్వామి, ఏలూరు పరిసర గ్రామాలకు చెందిన గురుస్వాముల ఆధ్వర్యంలో కేరళ ఆచారాలతో అయ్యప్ప పడిపూజ, భజన నిర్వహించారు. నగర 34వ డివిజన్‌ కార్పొరేటర్‌ యర్రంశెట్టి సుమన్‌ స్వామి పడి పూజ నిర్వహించారు. అరటి డొప్పలతో, విద్యుత్‌ పంచరంగుల దీపాలంకరణలతో వేదికను ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వాములు సామూ హికంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భజనలు చేశారు. స్వాములు నృత్యాలు చేస్తూ కర్పూర జ్యోతులతో భజనలో పాల్గొన్నారు.

నేడు అర్ధవరంలో కోటి దీపోత్సవం

గణపవరం, నవంబరు 20 : అర్థవరంలో దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో సోమవారం కోటి దీపోత్సవ మహోత్సవాలు నిర్వహిస్తామని సాయి సహస్త్ర లైఫ్‌ స్పైసెస్‌ గ్రీన్‌ మిడోస్‌ ఎండీ నారాయణరాజు ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి దీపోత్సవ వేడుకలు అనంతరం అన్నసమారాధన నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2022-11-20T23:38:54+05:30 IST