జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి

ABN , First Publish Date - 2022-11-28T23:33:11+05:30 IST

మహిళా విద్య, అంటరానితనం రూపు మాపడానికి కృషి చేసిన సామాజిక ఉద్యమకర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని పలువురు నాయకులు అన్నారు.

జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి
పాలకొల్లులో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నేతల నివాళి

పాలకొల్లు టౌన్‌, నవంబరు 28: మహిళా విద్య, అంటరానితనం రూపు మాపడానికి కృషి చేసిన సామాజిక ఉద్యమకర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని పలువురు నాయకులు అన్నారు. ఆయన అడుగు జాడల్లో నడవాల న్నారు. పూలే వర్ధంతి సందర్భంగా సోమవారం పట్టణంలోని గాంధీ బొమ్మల సెంటర్‌ వద్ద ఉన్న పూలే విగ్రహానికి పలు పార్టీల నాయకులు పూల మాల లు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు యడ్ల శివాజీ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. పీసీసీ సభ్యుడు షేక్‌ మహబూబ్‌ జానీ, బోణం వెంకట్రావు, కొలుకులూరి అర్జునరావు, రొఖ్ఖాల బెన్నీపాల్‌, తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పట్టణ నాయకుల ఆధ్వర్యంలో పూలే వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, కర్నేన గౌరునాయుడు, పెచ్చెట్టి బాబు, జివి, తదితరులు నివాళులర్పించారు. వైసీపీ ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, యడ్ల తాతాజీ, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్‌వీఆర్‌జీవీ ప్రాఽథమిక పాఠశాలలో హెచ్‌ఎం ఆర్‌.భవానీ ప్రసాద్‌

నరసాపురం టౌన్‌: జ్యోతిరావుపూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పార్టీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. టీడీపీ కార్యాలయంలో ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, బీసీ సంఘం అధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనమాల శ్రీనివాస్‌ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చైర్‌పర్సన్‌ వెంకటర మణ, కె నరేష్‌, దొంగ మురళీ, కె సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

భీమవరం అర్బన్‌: జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే సేవా సమితి ఆధ్వర్యంలో ఎవీర్‌ అప్పాజీ ఇందిరమ్మ కాలనీలో నిరుపేదలకు, వృద్దులకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు.

Updated Date - 2022-11-28T23:33:14+05:30 IST