AP News: జీసస్.. జగన్‌కు సద్బుద్ధి ప్రసాదించు..

ABN , First Publish Date - 2022-09-25T20:49:49+05:30 IST

జంగారెడ్డిగూడెం, ఏలూరు: ఎన్టీఆర్ (NTR) హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ (YSR) హెల్త్ యూనివర్సిటీగా మార్చాలన్న సీఎం జగన్ (CM Jagan) నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యూనివర్సిటీ పేరు మార్చాలని అవసరం లేదని వివిధ పార్టీల నాయకులు

AP News: జీసస్.. జగన్‌కు సద్బుద్ధి ప్రసాదించు..

జంగారెడ్డిగూడెం, ఏలూరు: ఎన్టీఆర్ (NTR) హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ (YSR) హెల్త్ యూనివర్సిటీగా మార్చాలన్న సీఎం జగన్ (CM Jagan) నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యూనివర్సిటీ పేరును మార్చాల్సిన అవసరం లేదని వివిధ పార్టీల నాయకులు ముక్తకంఠంగా చెబుతున్నారు. జగన్ నిర్ణయాన్ని ఎన్టీఆర్ కుటుంబసభ్యులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించాలని రెడ్డి గణపవరం గ్రామంలోని చర్చిలో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. ఆయన వెంట రాష్ట్ర ఎస్సీ సెల్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మనెల్లి. బాలు, బొబ్బర. ఎలీషా, గ్రామ కమిటీ అధ్యక్షుడు చిలకమూడి సుధాకర్ తూముపాటి. దుర్గారావు, పుసులురి. శ్రీను, తూముపాటి .సుబ్బారావు,బొబ్బర సందీప్, పసుమర్తి. భీమేశ్వరరావు, గన్నిన. సూర్యచంద్రరావు తదితరాలు పాల్గొన్నారు.



Read more