-
-
Home » Andhra Pradesh » West Godavari » inspection in shops-MRGS-AndhraPradesh
-
ప్లాస్టిక్ వాడితే చట్టపరమైన చర్యలు
ABN , First Publish Date - 2022-07-19T05:21:52+05:30 IST
ప్లాస్టి క్‌ను వాడితే చట్టపరమైన చర్యలు తీసు కుంటామని నగరపాలక సంస్థ కమిష నర్ షాహీద్‌బాబు హెచ్చరించారు.

ఏలూరుటూటౌన్, జూలై 18: ప్లాస్టి క్‌ను వాడితే చట్టపరమైన చర్యలు తీసు కుంటామని నగరపాలక సంస్థ కమిష నర్ షాహీద్‌బాబు హెచ్చరించారు. వన్‌టౌన్‌లోని హోటళ్ళు, షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. 75 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను సీజ్ చేసి స్వాధీనం చేసు కుని యాజమానులపై జరిమానాలు విధించారు. కార్యక్రమంలో డీఈ సత్యనారాయణ, ఎంహెచ్‌ఓ డాక్టర్ మాలతి, పాల్గొన్నారు.
చింతలపూడి: దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు నిషేధించినప్పటికీ వినియో గిస్తున్నారని, తనిఖీల్లో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పంచాయతీ కమిషనర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. సోమవారం పలు దుకాణాల్లో తనిఖీలు జరిపి ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్రీ పాయింట్లు, పాలు, పెరుగు పాయింట్లు, మిఠాయి దుకాణాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, పట్టుపడితే మాత్రం జరిమానాలు విధిస్తామని చెప్పారు.