పద్మశాలీ నాయకుల గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2022-04-24T05:55:33+05:30 IST

పద్మశాలీ నాయకుల గృహ నిర్బంధం

పద్మశాలీ నాయకుల గృహ నిర్బంధం
బెనర్జీబాబుకు నోటీసు అందిస్తున్న పోలీసులు

చేనేత మహాధర్నాకు వెళ్లకుండా నోటీసులు
తాడేపల్లిగూడెం అర్బన్‌, ఏప్రిల్‌ 23: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ మహాధర్నాకు వెళ్తున్న పద్మశాలీ సంఘ నాయకులను శనివారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తాడేపల్లిగూడేనికి చెందిన సంఘ రాష్ట్ర ఉపాద్యక్షుడు బండారు బెనర్జీబాబు, సాయిరాం అప్పారావు ధర్నాకు వెళ్లకుండా పోలీసులు నోటీసులు ఇచ్చారు. గృహ నిర్బంధాలను సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు.


Read more