జోరు వాన

ABN , First Publish Date - 2022-09-29T06:32:20+05:30 IST

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

జోరు వాన
మండవల్లిలో ప్రధాన రహదారిపై నిలిచిన వర్షపునీరు

అత్యధికంగా మండవల్లిలో 148.4 మిల్లీమీటర్లు వర్షపాతం 

కైకలూరు, ముదినేపల్లిలో భారీ వర్షం.. రహదారులు జలమయం


ఏలూరుసిటీ, సెప్టెంబరు 28: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కైక లూరు, మండవల్లి, ముదినేపల్లి, పోలవరం, చింతలపూడి, లింగపాలెం, భీమడోలు మండలం లోని పూళ్ళ, పోలసానిపల్లి, ముసునూరులో భారీ వర్షం కురిసింది. కైకలూరులో రహదారులు చెరువుల్లా మారాయి.పల్లపు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో అత్యఽధికంగా మండవల్లి మండలంలో 148.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవగా జిల్లాలో సరాసరి వర్షపాతం 14.5 మి.మీ నమోదైంది. కైకలూరులో 94, ముదినేపల్లిలో 90.6, కలిదిండిలో 43.4, ఏలూరులో 12.4, పెదపాడులో 9.6,ముసునూరులో 6.3 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. చింతలపూడి, కైకలూరులో 2 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. మెట్ట ప్రాంతాల్లో ఈ వర్షం పంటలకు అనుకూలిస్తుం దని చెబుతున్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాల వల్ల పంటచేలు మునిగిపోయాయి. 

Read more