విద్యార్థులకు గవర్నర్ అభినందన
ABN , First Publish Date - 2022-12-30T00:07:24+05:30 IST
ఆంగ్లభాషలో చూడచక్కని చేతిరాతకు సంబంధించి నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి పశ్చిమ జిల్లా పాఠశాలలకు చెందిన పలువురు బాల బాలికలను గురువారం రాష్ట్రగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్లో అభినందించారు.

జాతీయ స్థాయి చేతిరాత పోటీలకు ఎంపికైన
విద్యార్థులకు గవర్నర్ అభినందన
ఏలూరు ఎడ్యుకేషన్/ భీమవరం టౌన్, డిసెంబరు 29 : ఆంగ్లభాషలో చూడచక్కని చేతిరాతకు సంబంధించి నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి పశ్చిమ జిల్లా పాఠశాలలకు చెందిన పలువురు బాల బాలికలను గురువారం రాష్ట్రగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్భవన్లో అభినందించారు. వివ రాలను జిల్లా పౌరసంబంధాలశాఖాధికారి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అమ్మఒడి హ్యాండ్రైటింగ్ అండ్ కాలిగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చేతి రాత పోటీల్లో రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి పోటీలకు ధర్మాజీగూ డెంలోని హోలీ ట్రినిటీ స్కూలు తొమ్మిదో తరగతి విద్యార్థి డి.యశశ్రీ, ఏలూరు తంగెళ్ళమూడిలోని జేఎంజే స్కూలు ఎనిమిదో తరగతి విద్యార్థిని కె.అంజలి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కుమారుడు జివితేష్, కురసాల సిరికృష్ణ, శ్రావ్యాంజలి, స్ఫూర్తి, హర్షిత, అంజలి, జయశ్రీ, డమరేష్, మనుశ్రీలను అభినం దించారు. చేతిరాత నిపుణుడు పి.భువనచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Read more