కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి

ABN , First Publish Date - 2022-07-13T00:55:25+05:30 IST

ఏలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. స్పిల్ వే ఎగువన 34.100 మీటర్లు, దిగువన 25.815 మీటర్ల నీటిమట్టం నమోదైంది. స్పీల్ వే 48 గేట్ల ద్వారా

కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి

ఏలూరు జిల్లా:  పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. స్పిల్ వే ఎగువన 34.100  మీటర్లు, దిగువన 25.815 మీటర్ల నీటిమట్టం నమోదైంది. స్పీల్ వే 48 గేట్ల ద్వారా 12,09195 కూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద నీటి ప్రవాహంతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. కడెమ్మ వంతెన ప్రాజెక్ట్ పూర్తిగా నీటమునిగింది. పోలీస్  చెక్ పోస్టును  వరద నీరు చుట్టుముట్టింది. ప్రాజెక్టు ప్రధాన రహదారిపై వరద నీటిమట్టం  14 అడుగుల చేరడంతో ప్రాజెక్టులోకి రాకపోకలు నిలిపివేశారు. 

Read more