-
-
Home » Andhra Pradesh » West Godavari » gas workers agitation-MRGS-AndhraPradesh
-
గ్యాస్ కార్మికులను వెంటనే విధులోకి తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-07-06T05:16:29+05:30 IST
దశిక గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం అన్యాయంగా తొలగించిన గ్యాస్ డెలివరీ సిబ్బందిని వెంటనే విధులలోకి తీసుకోవాలని జిల్లా యూనియన్ అధ్యక్షుడు బి సీతారామయ్య, ఉపాధ్యక్షులు సనపల శ్రీను డిమాండ్ చేశారు.

భీమవరం అర్బన్, జులై 5: దశిక గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం అన్యాయంగా తొలగించిన గ్యాస్ డెలివరీ సిబ్బందిని వెంటనే విధులలోకి తీసుకోవాలని జిల్లా యూనియన్ అధ్యక్షుడు బి సీతారామయ్య, ఉపాధ్యక్షులు సనపల శ్రీను డిమాండ్ చేశారు. గ్యాస్ వర్కర్స్ యూనియన్, సీఐటీయు ఆధ్వర్యంలో మంగళవారం 8వరోజు దీక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్మికులను పనిలోకి తీసుకోని పక్షంలో భీమవరంలో ఉన్న గ్యాస్ అన్ని గ్యాస్ కంపెనీల కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దీక్ష కార్యక్రమంలో యునియన్ నాయకులు లక్ష్మణరావు, రాముడు, పి.రంగరాజు, ఎం.మురళి, పి.లక్ష్మణరావు, ఎం.రామకృష్ణ, నక్క రాంబాబు, రాము, ధనరాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు.