-
-
Home » Andhra Pradesh » West Godavari » ganesh utsav-NGTS-AndhraPradesh
-
గణపతి నవరాత్రి పూజలు.. ఊరేగింపులు
ABN , First Publish Date - 2022-09-08T05:44:57+05:30 IST
గణపతి నవరాత్రి మహోత్సవాలలో ఒక వైపు పూజా కార్యక్రమాలు, మరోవైపు నిమజ్జన ఊరేగింపులు జరుగుతున్నాయి.

పాలకోడేరు, సెప్టెంబరు 7: గణపతి నవరాత్రి మహోత్సవాలలో ఒక వైపు పూజా కార్యక్రమాలు, మరోవైపు నిమజ్జన ఊరేగింపులు జరుగుతున్నాయి. మండలంలో వినాయకుడి నిమజ్జన ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పాలకోడేరులో మేళతాళాలు, బుట్టబొమ్మలు మధ్య తరలించి నిమజ్జనం చేశారు. విస్సాకోడేరులో ఎమ్మెల్యే రామరాజు దర్శించుకొని పూజలు చేశారు. గొల్లలకోడేరులోని బీడులో వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని అన్నసంతర్పణ నిర్వహించారు.
మొగల్తూరు: మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వర్ధమానివారివీధి, చిన్నగొల్లగూడెం, వెలిదివారి వీధి ప్రాంతాల్లో విగ్రహాలను ఊరేగింపుతో తరలించి నిమజ్జనం చేశారు. పడమటిపాలెంలో పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు.

భీమవరం టౌన్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గునుపూడిలోని విద్యాగణపతి ఆలయంలో స్వామివారికి అటుకులతో అలంకారం చేశారు. మెంటే వారితోటలో విజయ గణపతికి స్వీట్స్‌తో అలంకారం చేశారు.
