AP News: ఏలూరులో పిడుగుపాటుతో నలుగురు మృతి

ABN , First Publish Date - 2022-08-17T15:26:45+05:30 IST

జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో విషాదం చోటు చేసుకుంది.

AP News: ఏలూరులో పిడుగుపాటుతో నలుగురు మృతి

ఏలూరు: జిల్లాలోని లింగపాలెం మండలం బోగోలులో విషాదం చోటు చేసుకుంది. జామాయిల్ తోటలో పిడుగుపాటుతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొందరిని విజయవాడకు తరలించారు. బాధితులు జామాయిల్ చెట్లు నరకడానికి కాకినాడ జిల్లా అన్నవరం నుంచి వచ్చినట్లు గుర్తించారు. మృతులు కొండబాబు (35), రాజు (28), ధర్మరాజు (25), వేణు (19)గా తెలుస్తోంది. అలాగే గణేష్, అర్జున్, బుల్లయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Read more