వరద బాధితులకు లోకేష్ సాయం

ABN , First Publish Date - 2022-08-02T01:36:57+05:30 IST

వరద బాధితులకు టీడీపీ నేత నారా లోకేష్ ‘ఆపన్న హస్తం’ అందిస్తున్నారు. గోదావరి వరదల వలన నిరాశ్రయులైన వారిని ఆదుకున్నారు.

వరద బాధితులకు లోకేష్ సాయం

పోలవరం: వరద బాధితులకు టీడీపీ నేత నారా లోకేష్ ‘ఆపన్న హస్తం’ అందిస్తున్నారు. గోదావరి వరదల వలన నిరాశ్రయులైన వారిని ఆదుకున్నారు. పోలవరం నియోజకవర్గంలో వరదలకు నిరాశ్రయులైన వేలేరుపాడు మండలం, రుద్రంకోట గ్రామ ప్రజలకు 500 కుటుంబాలకు సాయం చేశారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వదర బాధితులకు బియ్యం, కూరగాయలను లోకేష్ పంపారు. లోకేష్ పంపిన బియ్యం, కూరగాయలను నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు, బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మీడియాతో మట్లాడుతూ బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని, అన్నివిధాలా న్యాయం జరిగేలా ప్రభుత్వంపై పోరాడతామని, అధైర్య అడవద్దని ధైర్యం చెప్పారు.  సాయం అందుకున్న వరద బాదితులు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అమరవరపు అశోక్, ప్రధాన కార్యదర్శి కట్టం రాంబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు కొఠారి రామారావు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గొంది నాగేశ్వరరావు, ఐటీడీపీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు శావిలి సుభాష్ చంద్రబోస్,  నాయకులు  అమరవరపు వేంకటేశ్వర్లు, బోలిన బాబ్జీ, ముదిగొండ రామకృష్ణ,  కొఠారి సత్యనారయణ, చిట్టూరి శ్రీనివాసరావు, కొక్కెరపాటీ యువరాజు, తుంగా అలివేలు, మద్దినశెట్టి సూర్యనారాయణ, అల్లక సత్యనారాయణ, ఏలూరు అజేష్, హేమంత్, కోటిపల్లి ముత్యాలరావు, నూపా శ్రీరాములు గార్లు తదితరులు పాల్గొన్నారు.

Read more