ఆసుపత్రి వద్ద రెండు వర్గాల ఘర్షణ

ABN , First Publish Date - 2022-04-25T05:16:27+05:30 IST

ప్రాణపాయంలో వున్న వారికి వైద్యం అందించడానికి జిల్లా ప్రభుత్వాసుపత్రి ఉండగా, కొంతమంది మాత్రం తమ గొడవలు, ఘర్షణలకు అడ్డాగా మార్చుకుంటున్నారు.

ఆసుపత్రి వద్ద రెండు వర్గాల ఘర్షణ

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 24: ప్రాణపాయంలో వున్న వారికి వైద్యం అందించడానికి జిల్లా ప్రభుత్వాసుపత్రి ఉండగా, కొంతమంది మాత్రం తమ గొడవలు, ఘర్షణలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. దెందులూరు మండలం గాలాయగూడెంకు చెందిన రెండు వర్గాల వారు కొట్లాట గొడవలో చికిత్స కోసం ఆసుపత్రి వచ్చారు. అక్కడే ఘర్షణ కు దిగారు. దీంతో పెద్దసంఖ్యలో జనం గుమిగూడారు. టుటౌన్‌ సీఐ డీవీరమణ ఆధ్వర్యంలో టుటౌన్‌ సంఘటనా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 


Read more