-
-
Home » Andhra Pradesh » West Godavari » father murder-NGTS-AndhraPradesh
-
తండ్రిని చంపిన తనయుడు
ABN , First Publish Date - 2022-03-16T06:35:18+05:30 IST
ఆ ఇంటిలో కుటుంబ కలహాలు శ్రుతిమించాయి.

కొయ్యలగూడెం, మార్చి 15 : ఆ ఇంటిలో కుటుంబ కలహాలు శ్రుతిమించాయి. తండ్రీ కొడుకులు కొట్లాటకు దిగారు. కర్రలతో ఒకరినొకరు బాదుకున్నారు. చివరకు కొడుకు చేతిలో తండ్రి దుర్మరణం పాలయ్యాడు. కొయ్య లగూడెం మండలం బోడిగూడెంలో మంగళవారం జరి గిన ఈ ఘటనపై ఎస్ఐ సతీష్‌కుమార్ తెలిపిన వివ రాలివి.. తేరుబోయిన రామారావు(50), అతని కొడుకు వెంకటరమణ మంగళవారం ఉదయం గొడవపడ్డారు. ఈ క్రమంలో కొడుకు తండ్రిని కర్రతో గట్టిగా కొట్టడం తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కుమారుడితోపాటు కుమార్తె ఉంది. కొన్ని రోజులుగా తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చివరకు చంపుకునే వరకు వెళ్లాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.