ఇది రైతు నయవంచన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-04-10T05:39:45+05:30 IST

రాష్ట్రంలో రైతు నయవంచన ప్రభుత్వం రాజ్యమేలుతోందని, 51 రోజుల్లో ధాన్యం సొమ్ము చెల్లిస్తామని ప్రకటించి.. నాలుగునెలలు గడిచినా రైతుల ఖాతాల్లో సొమ్ము జమకాని పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది రైతు నయవంచన ప్రభుత్వం
సదస్సులో మాట్లాడుతున్న మాజీ మంత్రి పితాని

నాలుగు నెలలు గడిచినా రైతులకు చెల్లించని ధాన్యం సొమ్ము

మాజీ మంత్రి పితాని ఆగ్రహం

పెనుమంట్ర, ఏప్రిల్‌ 9 : రాష్ట్రంలో రైతు నయవంచన ప్రభుత్వం రాజ్యమేలుతోందని, 51 రోజుల్లో ధాన్యం సొమ్ము చెల్లిస్తామని ప్రకటించి.. నాలుగునెలలు గడిచినా రైతుల ఖాతాల్లో సొమ్ము జమకాని పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణచెరువు గ్రామంలో ఆచంట నియోజకవర్గ తెలుగు రైతు సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ రైతు పక్షపాతిగా చెప్పుకుంటున్న  జగన్‌ ప్రభుత్వం కేంద్రమిస్తున్న సొమ్ముకు రాష్ట్ర ప్రభుత్వం కొంత జోడించి తామే చెల్లిస్తున్నామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు ఎన్నికవుతారనే భయంతో సొసైటీలకు, నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. అన్ని విధాలా ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు మెట్ల రమణ మాట్లాడుతూ జగన్‌ మోహన్‌రెడ్డి మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని, ధాన్యం సొమ్ము ఆలస్యం కావడంతో వడ్డీకి తెచ్చిన   రైతులు గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు.  రైతులకు పూర్వ వైభవం రావాలంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వం రావాలని అందుకు రైతులను చైతన్య వంతులను చేయాలని పిలుపునిచ్చారు. నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి,             తమనంపూడి శ్రీనివాసరెడ్డి, వెలగల బుల్లి రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గంధం వెంకటరాజు, బాబూరాజేంద్ర ప్రసాద్‌, పెనుమత్స సూర్యనారాయణరాజు, ఉప్పలపాటి సురేష్‌ బాబు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ సానబోయిన గోపాలకృష్ణ, చింతపల్లి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన పెనుమంట్ర ప్రజాచైతన్య సదస్సులో ఆయన జగన్‌ ఎన్నికల ముందు చెప్పిన మాటలు, ఇప్పుడు కరెంట్‌ బిల్లుల బాదుడుపై ప్రజలను చైతన్యం చేసేందుకు గ్రామగ్రామాన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. నియోజక వర్గ అనుబంధ సంస్థల కమిటీ చైౖర్మన్‌లను ప్రకటించారు. 2024 ఎన్నికలకు ఇప్పటినుంచే  కసరత్తు ప్రారంభించాలని సూచించారు. 

Updated Date - 2022-04-10T05:39:45+05:30 IST