‘ప్రతి ఒక్కరూ కళాకారులను ఆదుకోవాలి’

ABN , First Publish Date - 2022-09-12T05:23:07+05:30 IST

కళలు సజీవంగా ఉండాలంటే కళాకారులను ప్రతిఒక్కరూ ఆదుకో వాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌ పిల్లంగోళ ్ళ శ్రీలక్ష్మి అన్నా రు.

‘ప్రతి ఒక్కరూ కళాకారులను ఆదుకోవాలి’

ఏలూరు కల్చరల్‌, సెప్టెంబరు 11 : కళలు సజీవంగా ఉండాలంటే కళాకారులను ప్రతిఒక్కరూ ఆదుకో వాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌ పిల్లంగోళ ్ళ శ్రీలక్ష్మి అన్నా రు. ఆదివారం స్థానిక వైఎంహెచ్‌ఏ ప్రాంగణంలో హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 43వ సాంస్కృతిక కళామహోత్సవం నిర్వహించారు. జాహ్నవి లాలిత్య స్వాగత నృత్యం అలరించింది. అభయ ప్రసన్నాంజనేయ నాట్య మండలి వారిచే శ్రీరామాంజనేయ యుద్ద సన్నివేశం ఆకట్టుకుంది. నగర పాలక సంస్ధ కమిషనర్‌ సాహిద్‌కు గౌరవ సత్కారం చేశారు. గుప్తా ఫౌండేషన్‌ ఆర్థికసాయంతో సీనియర్‌ కళాకారుడు కాట్రు వీరాంజనేయులు, కణితి రాంబాబు, సత్రంపద్మ తదితరులను సత్కరించారు. నగర పాలక సంస్థ విప్‌ పైడి భీమేశ్వరరావు, సంస్థ ప్రధాన కార్యదర్శి పెదపాటి రామకృష్ణ, కేవీ సుబ్బారావు, గుప్తా ఫౌండేషన్‌ ప్రతినిధి పట్టాభి, వి.రామాంజనేయ సిద్దాంతి, పి.కొండలరావు తదితరులు పాల్గొన్నారు. 

Read more