ఇప్పటికిక్కడ.. రేపెక్కడో ?

ABN , First Publish Date - 2022-03-23T06:27:48+05:30 IST

ఓ వైపు కొత్త జిల్లా ఏర్పాటు, మరోవైపు బదిలీలు.. వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగు లకు కలవరం పుట్టిస్తుండగా, అదే సమయంలో కీలకమైన ఆరోగ్య కార్యక్రమాల అమలుకు క్షేత్రస్థాయిలో పలు ఇబ్బం దులు తెచ్చిపెట్టేవిలా ఉన్నాయి.

ఇప్పటికిక్కడ.. రేపెక్కడో ?

బదిలీలు, కొత్త జిల్లా ఏర్పాటుతో ఆరోగ్య శాఖ ఉద్యోగుల్లో గుబులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 22 : ఓ వైపు కొత్త జిల్లా ఏర్పాటు, మరోవైపు బదిలీలు.. వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగు లకు కలవరం పుట్టిస్తుండగా, అదే సమయంలో కీలకమైన ఆరోగ్య కార్యక్రమాల అమలుకు క్షేత్రస్థాయిలో పలు ఇబ్బం దులు తెచ్చిపెట్టేవిలా ఉన్నాయి.ప్రస్తుతం ఏకకాలంలో జరు గుతున్న బదిలీలు,కొత్త జిల్లా ఏర్పాట్లలో ఆరోగ్యశాఖ కార్యాల యానికి ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలు పలు అంశాల్లో సమస్యలు తలెత్తడం ఖాయమని భావిస్తున్నారు.కొత్తజిల్లా ఏర్పాటు తరువాతే ఆరోగ్య శాఖలో బదిలీలు చేపడితే ఏ ఉద్యోగులు ఎక్కడెక్కడ పనిచేయాల్సి ఉంటుందో స్పష్టత ఉం డేదని,దీనికి భిన్నంగా నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ వల్ల ఇప్పుడు బదిలీలు పొందే ఉద్యోగ సిబ్బంది అయోమయ పరిస్థితిని ఎదుర్కోవాల్సిందేనని చెబుతున్నారు. 

ఉద్యోగుల ఆందోళన.. 

డీఎంహెచ్‌వో ఆఫీస్‌లో ఇప్పుడున్న పలు కేడర్ల ఉద్యోగుల్లో సగం మందిని కొత్త జిల్లాకు కేటాయిస్తున్నా రు.ప్రస్తుతం బదిలీ కౌన్సెలింగ్‌లో ఏలూరుకు నూతన బదిలీపై వచ్చి చేరిన ఉద్యోగి మరికొద్ది రోజుల్లో కొత్త జిల్లాకు వెళ్లిపో వాల్సి రావచ్చు.దీని వల్ల ఎంతో ఆశతో వచ్చిన ఉద్యో గికి ఉపయోగం ఏముంటుందని ఆందోళన చెందుతున్నారు.

పస్తుతం జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ముమ్మరంగా జరుగుతోంది.వ్యాక్సిన్‌ తరలింపునకు ఇద్దరు సూపర్‌వై జ ర్లు,వాహనాలు రెండే ఉన్నాయి.వీటిలో చెరిసగం కొత్త జిల్లాకు కేటాయిస్తున్నారు.ఇప్పటివరకు జిల్లాకు దిగుమతి అయ్యే వ్యాక్సిన్‌ నిల్వలను ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని పీహెచ్‌సీలకు సకాలంలో తరలిస్తున్నారు. కొత్తగా ఏర్పడే జిల్లాను కవర్‌ చేయడానికి అక్కడ పటిష్టమైన కోల్డ్‌చైన్‌ ఏర్పాటు చేయడానికి జాప్యం ఎదురుకావచ్చు.

పలు విభాగాల్లో మంజూరు (శాంక్షన్డ్‌) పోస్టులు ఉన్నా వాటిలో చాలా ఖాళీగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బందినే కొత్త జిల్లాకు కేటాయించడం వల్ల ఇరువైపులా ఉద్యోగులపై పని భారం రెట్టింపవుతోంది.

సమస్య పరిష్కారానికి సూచన..

మలేరియా, ఫైలేరియా,ఎయిడ్స్‌ అండ్‌ లెప్రసీ విభాగాల్లో క్రియాశీలకంగా పెద్దగా పనులు ఉండడం లేదని చెబుతు న్నారు.ఇటువంటి విభాగాలను ఇతర విభాగాల్లోకి విలీనం చేసి,వాటిలోని సిబ్బందిని డిమాండ్‌ ఉన్న చోటకు విని యోగిస్తే కొంతవరకు సిబ్బంది కొరత సమస్య పరిష్కార మవుతుందన్నది మిగతా ఉద్యోగుల అభ్యర్థనగా ఉంది.


Read more